Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చట్ట వ్యతిరేకంగా పోలీసులు ఫేస్ రికగజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ)ని వాడటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని వాళ్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల ధర్మాసనం ఆదేశించింది. చట్టం ఏమీ చేయకుండానే పోలీసులు ఎఫ్టీఆర్ అమలు చేస్తున్నారనీ, తన అనుమతి లేకుండా పోలీసులు 2015లో రోడ్డుపై ఫొటోలు, బయోమెట్రిక్ తీసుకోవడాన్ని ఉదహరిస్తూ ఎస్క్యూ మసూద్ పిల్ వేశారు. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం చట్ట వ్యతిరేకమనీ, ఆధార్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోలీసులు చేస్తున్నారని పిటిషనర్ వాదించారు. క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ విధానం కింద కేంద్రం రాష్ట్రాలను సమన్వయం చేసుకునీ, ఆ డేటాను తీసుకోవడం అన్యాయమని అన్నారు. డేటా ఎక్కడ పెడుతున్నారో, ఏం చేస్తున్నారో సైతం సమాచార హక్కు చట్టం కింద వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆసక్తి చూపలేదన్నారు. 2015లో తీసుకున్న పిటిషనర్ ఫొటోలు, బయోమెట్రిక్ వివరాల్ని డిలీట్ చేయాలనీ, సిటీ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తే స్పందన లేదని అన్నారు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
రెండు రిట్లపై తీర్పు రిజర్వు
వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో తమపై సీబీఐ చార్జిషీటు దాఖలయ్యామని రిటైర్డు ఐఏఎస్ అధికారి కపానందం వేసిన కేసులో హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. రఘురాం సిమెంట్స్‌కు (భారతి సిమెంట్స్) మైనింగ్ కోసం భూముల లీజుల చర్యలన్నీ సక్రమంగా జరిగాయనీ, కావాలనే సీబీఐ కేసులో ఇరికించిందని ఆయన రిట్‌ను జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సోమవారం విచారించారు.ఇదే మాదిరిగా ఇందూ కంపెనీ అధినేత శ్యాంప్రసాద్‌రెడ్డి వేసిన మరో కేసులోనూ హైకోర్టులో వాదనలు పూర్తి కావడంతో తీర్పు వాయిదా పడింది. సీబీఐ కోర్టు విచారణకు మినహాయింపు ఇవ్వాలనీ, వ్యాపారలావాదే వీల్లో బిజీగా ఉంటాననీ వేసిన రిట్‌పై తీర్పు తర్వాత చెబుతామని హైకోర్టు ప్రకటించింది.