Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను ఆ వర్సిటీ ఉపకులపతి కె సీతారామారావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ అకడమిక్ డైరెక్టర్ ఈ సుధారాణి, రిజిస్ట్రార్ జి లక్ష్మారెడ్డి, సీఎస్డీటీ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ బానోత్లాల్, అన్ని విభాగాల అధిపతులు, డీన్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.