Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దవాగు అప్పగింతపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఆరున హైదరాబాద్‌లో జరగనుంది. ఈనేపథ్యంలో సాగునీటి శాఖ అధికారు లు సమాయ త్తమవుతున్నారు. జలసౌధలో ప్రత్యక్షంగా భేటి జరుగుతుందని సమా చారం.ఇందులో జీఆర్ఎంబీకి పెద్దవాగు ప్రాజెక్టు అప్పగించే విషయమై చర్చించనున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు 1973కు ముందు నిర్మించి న సంగతి తెలిసిందే.ఈ ప్రాజెక్టును జీఆర్ఎంబీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఇప్పటికే సాగునీ టిరంగ నిపుణులు అభిప్రాయపడ ుతున్నారు. తొలుత ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశంతో ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో పెద్దవాగును కూడా జీఆర్ఎంబీకి అప్పగించాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం.ఈ సమావేశంలో జీఆర్ఎంబీ బోర్డు సభ్యులు,సబ్‌కమిటీ సభ్యులు పాల్గొననున్నారు.