Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతుసంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో చిట్‌ఫండ్ సంస్థల ఆర్థిక నేరాలను అరికట్టాలని తెలంగాణ రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, నాయకులు పి వెంకట్‌రెడ్డి, బాధితరులు ఎస్ సతీశ్, జి రవీందర్, దామోదర్‌రెడ్డి, శోభ, హరిప్రియ, శ్రీనివాస్ తదితరులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని చిట్‌ఫండ్ సంస్థలు రైతులు,సామాన్య, మధ్యతరగతి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నా యని విమర్శించారు.ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నాయని తెలిపారు. అర్హతలేని బినామీ పేర్లతో గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసి మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. తెల్లకాగితాలపై సంతకాలు తీసుకుంటున్నారనీ, ఇది చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధమని వివరించారు. కొన్ని సంస్థలు ఆలస్యంగా పేమెంట్ చేస్తున్న వాటిపై ఫిర్యాదులను పూర్తి చేసిన తర్వాతే కొత్త గ్రూపులకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదులు గుట్టలుగా పేరుకుపోతున్నా వాటిని పరిష్కరించకపోగా ఆ సంస్థలకు ఇతర ప్రాంతాల్లో వ్యాపారానికి అభివృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం దారుణమని విమర్శించారు. కొత్త యూనిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మోడల్ చిట్‌ఫండ్ యాక్ట్-2020ను సవరించి పటిష్ట చట్టాన్ని తేవాలని కోరారు.