Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 482 మందికి కరోనా సోకింది. ఒకరు మరణించారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు 38,362 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 3,228 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,048 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 294 మందికి కరోనా సోకింది.
19 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో ఆదివారంతో పోలిస్తే సోమవారం జీహెచ్ఎంసీతో పాటు 19జిల్లాల్లో కేసులు పెరిగాయి. మేడ్చల్ - మల్కాజిగిరి,రంగారెడ్డి,మహబూబాబాద్ జిల్లాల్లో కేసులు రెండంకెల్లో వచ్చాయి.కాగా ఖమ్మం,నిజామాబాద్,సంగారెడ్డి,సిద్దిపేట, వరంగల్ రూ రల్ జిల్లాల్లో తగ్గాయి. తొమ్మిది జిల్లాల కేసుల్లో ఎలాంటి మార్పు లేదు.
23 మందికి కరోనా
విదేశాల నుంచి వచ్చిన వారిలో 23 మందికి కరోనా ఉన్నట్టు బయటపడింది. వీరిలో వేరియంట్ ను గుర్తించేందుకు పరీక్షలకు పంపించారు. వీరితో కలుపుకుని 53 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.