Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడీఎఫ్‌లో మోడల్‌గా తెలంగాణ నిలవటం గర్వకారణం : మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలోని గ్రామీణాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం ఒక కొత్త శకానికి నాంది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ గారి సమర్థవంతమైన నాయకత్వం వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నదని కొనియాడారు. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. 96.74 శాతంతో దేశంలో తెలంగాణ తొలిస్థానంలో ఉందనీ, రెండో స్థానంలో ఉన్న తమిళనాడు (35.39శాతం)కు, మనకు భారీ వ్యత్యాసం ఉందని కేటీఆర్ ఉటంకించారు. పల్లె ప్రగతి కార్యక్రమం పకడ్బంధీగా అమలు చేయించేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న కృషికి ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ తెలంగాణ కోసం అహర్నిశలు పని చేస్తున్న పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.