Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీపై పల్లా ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీఎం కేసీఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి బీజేపీ నాయకులను హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆంధ్ర నాయకుల వ్యాపార సంస్థ స్వరాజ్య వేదిక అని విమర్శించారు. లేని రైతు ఆత్మహత్యలను ఉన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రైతుబంధుతో రైతులు సోమరులుగా మారుతున్నారని వ్యాఖ్యానించటం వారిని అవమానించినట్టేనని తెలిపారు. బీజేపీ ఎంపీలు శిఖండి పాత్ర పోషిస్తూ, రాష్ట్ర ప్రగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.