Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హన్మకొండ కలెక్టరేట్‌ను ముట్టడించిన రైతులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాగ్‌పూర్-క్రిష్ణపట్నం మధ్య జాతీయ నిర్మాణానికి సంబంధించి భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో భూ సేకరణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లాలోని దామెర మండలంలో పలు గ్రామాల్లో సర్వే చేయడానికి అధికారులు రాగా, ఇటీవల రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం దామెర మండలంలోని ఊరుగొండ, పసరగొండ, పరకాల మండలం మల్లక్‌పేట గ్రామాలకు చెందిన రైతులు పెద్ద మొత్తంలో హన్మకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం ప్రభుత్వం జరిపే బలవంతపు భూసేకరణ వెంటనే నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. మూడు పంటలు పండే సారవంతమైన నల్లరేగడి భూములను హైవే కోసం సేకరించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రైతులను అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ వద్దకు పలువురు రైతులు వెళ్లి వినతిపత్రాన్ని సమర్పించారు.