Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ నేతలతో చంద్రబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం మరింత చురుగ్గా పనిచేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో పలువురు నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాల గురించి చంద్రబాబుకు వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతానని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ రూపొందించాలని సూచించారు. చంద్రబాబుని కలిసిన వారిలో పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్యయాదవ్, ప్రదీప్‌చౌదరి, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంటు అధ్యక్షులు అశోక్ గౌడ్, సుభాష్ అధికార ప్రతినిధి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర ఎస్సీ సెల్ అశోక్‌కుమార్, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.