Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు నెలల కిందట ప్రేమ పెండ్లి
- మూడు నెలల కిందటే భర్త ఆత్మహత్య
- కొడుకు మృతికి కోడలే కారణమంటూ నరికి చంపిన మామ
- కాపాడే క్రమంలో తండ్రికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ - చెన్నూరు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట్ గ్రామంలో సౌందర్య(22) యువతి దారుణ హత్యకు గురైంది. తమ కొడుకు మృతికి కోడలే కారణమని కక్ష పెంచుకున్న మామ అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఘటనా స్థలాన్ని జైపూర్ ఏసీపీ నరేందర్ పరిశీలించారు. ఏసీపీ తెలిసిన వివరాల ప్రకారం.. ఏడు నెలల కిందట లింగన్నపేట్కు చెందిన బోరగాళ్ల సౌందర్య.. అదే గ్రామానికి చెందిన రాళ్లబండ సాయి(25) ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. మూడు నెలల కిందట సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఆత్మహత్యకు కోడలు సౌందర్యే కారణమని సాయి తండ్రి తిరుపతి కోపం పెంచుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం సౌందర్య తండ్రి లక్ష్మయ్యతో కలిసి పొలం పనులు చేసుకుంటున్న సమయంలో తిరుపతి వెళ్లి గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. గొంతుపై నరకడంతో సౌందరయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. కూతుర్ని కాపాడేందుకు తండ్రి యత్నించగా, తిరుపతి ఆయన చేయి, పొట్టపైనా గొడ్డలితో దాడి చేశాడు. సౌందర్య తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ వివరించారు.