Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతనంగా టీఎస్ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసినట్టు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ శ్రీధర్, ఎమ్ విమల్‌కుమార్ తెలిపారు. సోమవారంనాడిక్కడి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్టర్లకు విద్యుత్ సంస్థలు బకాయిలు భారీగా పేరుకుపోయాయనీ, తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకొచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్‌గా ఏర్పాడ్డామని తెలిపారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా జీ నర్సిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా జీ గోవర్థన్‌రెడ్డి, జేబీ నారాయణ, కోశాధికారిగా ఎన్ రవికాంత్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎమ్ నర్సిరెడ్డి, ఎన్ శ్రీనివాసరెడ్డి, ముఖ్య సలహాదారులుగా మహ్మద్ సిరాజుద్దీన్, ఎన్ రాజు ఎన్నికైనట్టు వివరించారు.