Authorization
Mon April 14, 2025 01:21:54 am
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉద్యోగుల సమస్యలను టీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇతర జిల్లాలకు బదిలీ చేయటం రాజ్యాగ, మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ చర్యతో ఉద్యోగులకు, వారి పిల్లలకు, నిరుద్యోగులకు కూడా భవిష్యత్తులో కూడా సమస్యలు తప్పవని ఆవేదన వ్యక్తంచేశారు. నూతన జోన్, జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలని డిమాండ్ చేశారు.
317 జీవోను ఉపసంహరించుకోవాలి: సీఎంకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు లేఖ
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఏకపక్షంగా విడుదల చేసిన మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరారు. న్యాయంగా బదిలీ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.