Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ ఐఆర్ఎస్ తిరుమల్ కుమార్
- ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమిలో సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అందరికీ విద్య అందించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రిటైర్డ్ ఐఆర్ఎస్ మేడిసెట్ట తిరుమల్ కుమార్ అన్నారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి ఐదో వార్షికోత్సవం, సావిత్రిబాయి ఫూలే 191వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఆమె కోరినట్టు ఎస్ఆర్ శంకరన్ తన జీవితమంతా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారని చెప్పారు. ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమి చీఫ్ గార్డెనర్, మాజీ ఐవోఎఫ్ఎస్ వై సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే, మహాత్మాజోతిబాఫూలే జీవిత చరిత్రలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అకాడమి చైర్మెన్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ యూపీఎస్సీ అందరినీ సమానంగా చూస్తున్నదని చెప్పారు. ప్రభుత్వరంగం మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతున్నదని వివరించారు. భారత రాజ్యాంగంలోని సమానత్వపు విలువలు అందరికీ అందేలా చూడాలని కోరారు. దాని కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు. అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీష్‌కుమార్ వందన సమర్పణ చేశారు.
ఉపాధ్యాయురాలకు ఆదర్శం : మల్లయ్య బట్టు
భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే 191 జయంతిని హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల సొసైటీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి ఫూలే చేసిన కృషిని వివరించారు. బాలికల విద్యతోనే మహిళాసాధికారత సాధ్యమని చాటిన సావిత్రిబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రమణారెడ్డి, డిప్యూటీ సెక్రటరీ ఇందిర, మంజుల, తిరుపతి, అసిస్టెంట్ సెక్రటరీ పద్మజ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.