Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటలో ఐదుగురు విద్యార్థులపై కేసు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ- సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో శనివారం రాత్రి జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు సంబంధించి ఐదుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదైంది. ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడిం చారు. హైదరాబాద్ మైలార్‌దేవులపల్లికి చెందిన సాయికుమార్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. డిసెంబర్ 15 నుంచి జనవరి 2 వరకు సెలవుల నేపథ్యంలో ఇంటికి వెళ్లిన సాయి కుమార్ సెమిస్టర్ పరీక్షల ప్రిపరేషన్ కోసం శనివారం రాత్రి హాస్టల్‌కు వచ్చాడు. ఆ తరువాత సెకండియర్ విద్యార్థులు సాయిని వారి గదికి పిలిచి.. ర్యాగింగ్ చేశారు. మద్యం మత్తులో ఉన్న సీనియర్లు నీ కులం ఏంటని అడిగారు. సార్ అని పిలవాలని, తల్లిదండ్రులు, అక్కాచెల్లి వివరాలు చెప్పాలని వేధించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌ను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘం, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కళాశాల ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌వర్మ, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్, బీసీ విద్యార్థి సంఘం నాయ కులు వీరబోయిన లింగయ్యయాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు గుండాల సందీప్, టీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు భారీ అశోక్‌కుమార్, ఆర్వీఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు వాసునాయక్ పాల్గొన్నారు.