Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు సజీవదహనం
- ఒకరి పరిస్థితి విషమం
- ఆస్తి తగాదాలే కారణం
- సూసైడ్‌నోట్‌లో పేర్కొన్న మృతుడు
- వనమా రాఘవపై కేసు నమోదు : ఏఎస్పీ రోహిత్
- నిందితులు రాఘవ పరార్
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు సెటిల్మెంట్కు మరో కుటుంబం బలైంది. ఆస్తి తగాదాల విషయంలో సెటిట్‌మెంట్ పేరుతో వేధింపులకు గురి చేయడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా మరొకరు తీవ్రంగా కాలిన గాయాలతో చావు బతుకుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఈ ఘటనలో సూసైడ్‌నోట్ లభించడంతో వనమా రాఘవ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచకు చెందిన మండిగ నాగరామకృష్ణ(38) నవభారత్‌లో మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య శ్రీలకిë, ఇద్దరు కవలపిల్లలు సాహితి, సాహిత్య ఉన్నారు. కాగా, రామకృష్ణ గతేడాది 'డాడీ రోడ్' అనే యాప్‌ను తన మిత్రులతో కలిసి ప్రారంభించారు. ఈ వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టడం, తీవ్ర నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. దాంతో అప్పుల కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. అప్పటికే తన ఇల్లు, కారుపై కూడా ఫైనాన్స్ తీసుకుని ఉండటంతో ఎక్కడా అప్పు దొరకలేదు. ఈ క్రమంలోనే తన తల్లిపేరుతో ఉన్న ఆస్తి అమ్మకానికి ప్రయత్నించగా అక్క మాధవి నిరాకరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావును సెటిల్మెంట్ కోసం ఆశ్రయించారు. దాంతో కొద్ది రోజుల కిందట ఇరువురిని కూర్కోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఈ సెటిల్మెంట్లో వారు రామకృష్ణను బాగా వేధించడంతో మానసికంగా కృంగిపోయిన రామకృష్ణ.. ఆదివారం అర్థరాత్రి లోగాని బజార్లో ఉన్న తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ చేసి భార్యా, కూతుర్లపై పెట్రోలు పోసి తానూ పోసుకుని నిప్పటించుకున్నాడు. దంపతులతో పాటు కూతురు సాహిత్య(13) అక్కడికక్కడే కాలి మృతి చెందారు. మరో కూతురు సాహితి మంటల వేడి తట్టుకోలేక బయటకు వచ్చి అరవడంతో ఆమెను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 80 శాతం కాలిపోగా పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మరోవైపు తీవ్ర గాయాలతో విషమ పరిస్థితిల్లో ఉన్న సాహితిని ఆస్పత్రిలో కొత్తగూడెం న్యాయమూర్తి అక్కడికి చేరుకుని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా మృతుని కారులో సూసైడ్ నోట్ లభించింది. దాని ఆధారంగా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, సూసైడ్‌నోట్‌లో.. 'తనకు ఆస్తి పంపకాల్లో తీరని అన్యాయం చేశారనీ, అక్క మాధవి, తల్లి సూర్యవతిల పక్షాన రాఘవేంద్రరావు సానుకూలంగా వ్యవహరించి తనను తీవ్రంగా వేధించాడనీ, నా కుటుంబం బలి కావడానికి కారణం తన తల్లి, అక్క, వనమా రాఘవేంద్రరావు' అని రామకృష్ణ పేర్కొన్నారు. వెంటనే ప్రాథమిక సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలను పరిశీలించారు. మృతురాలు శ్రీలకిë సోదరుడు జనార్ధన్‌రావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనమా రాఘవేంద్రరావు, తల్లి సూర్యవతి, అక్క మాధవిలపై ఐపీఎస్ సెక్షన్ 306 కేసు నమోదు చేశారు. ఏ-1గా మృతుడు 302, 307 సెక్షన్లు పెట్టగా ఎ-2గా వనమా రాఘవపై కేసు నమోదు చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తామని ఏఎస్పీ రోహిత్ తెలిపారు.
ఇంటి నుంచి పరారైన వనమా రాఘవ
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలో పోలీసులకు లభించిన సూసైడ్‌నోట్‌లో ప్రధాన కారకుడిగా తన పేరు ఉందని తెలియడంతో రాఘవ ఉదయాన్నే ఓ ప్రధాన సహచరుడితో కలిసి ఇంటినుంచి పరారైనట్టు తెలు స్తున్నది. ఈ కుటుంబం ఆస్తి తగాదాల్లో రామకృష్ణ అక్క మాధవి రాఘవతో కలిసి సెటిల్మెంట్పేరుతో రామకృష్ణను పలుమార్లు కూర్కోబెట్టి వేధింపులకు గురిచేయ డంతో పాటు బెదిరించినట్టు మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.