Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలకు వేయించే బాధ్యత పేరెంట్స్‌దే..
- జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ కూడా ఇస్తాం : వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- 15 నుంచి 18 ఏండ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం
నవతెలంగాణ-బంజారాహిల్స్
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సమస్య కాదు, అది సం రక్షణ.. పిల్లలకు టీకా వేయించాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో సోమవారం 15 నుంచి 18 ఏండ్ల వయసు కలిగిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ శర్మన్, డీహెచ్ శ్రీనివాస రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్, డీఎంహెచ్‌వో వెంకట్‌తో కలిసి మంత్రి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ కొనసాగుతోంద న్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొవాగ్జిన్ టీకా వేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం వ్యాక్సినేషన్లో రాష్ట్రం ముందం జలో ఉందన్నారు. వ్యాక్సినేషన్ మొదటి, రెండో డోసులు వందకు వంద శాతం పూర్తి చేసుకున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల వయస్సుగల పిల్లలు 18 లక్షల 70 వేల వరకు ఉన్నా రని, అందరూ వ్యాక్సిన్ తీసుకునేలా తల్లిదండ్రుల, పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు ప్రోత్సహిం చాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు, టీచర్ల సమ క్షంలో వ్యాక్సిన్లు వేస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రు లు విధిగా తమ పిల్లలను వ్యాక్సిన్ కేంద్రాలకు తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ప్రయివేట్ ఆస్పత్రుల్లోనూ టీకాలు ఇచ్చేందుకు పర్మిషన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వపరమైన ధ్రువీకరణ పత్రాలు ఏవి ఉన్నా టీకా వేసుకోవచ్చన్నారు.
జనవరి 10 నుంచి బూస్టర్ డోస్
జనవరి పది నుంచి 60ఏండ్లు పైబడి అనారోగ్యం తో బాధపడుతున్న వారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ బూస్టర్ డోసు ఇవ్వనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సిన్ల విషయంలో ఎటువంటి అపోహలు అవ సరం లేదని, రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. థర్డ్‌వేవ్‌ను వ్యాక్సిన్లు అరికడతాయని చెప్పారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు.