Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే కార్యదర్శి ఎస్ వినయకుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్పమానవతావాధి సావిత్రిబాయి ఫూలే అనీ,ఆమె పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్ చెప్పారు. సావిత్రీబాయిఫూలే 191వ జయంతి సందర్భంగా టీపీఎస్కే, కేవీపీఎస్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సావిత్రీబాయి జీవితం- మహిళా అభ్యున్నతి' అంశంపై కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి పీష్వా సామ్రాజ్యంలో బ్రాహ్మణాధిపత్యం బలంగా ఉండేదని చెప్పారు. ఆనాటి కాలంలోనే స్త్రీలకు విద్య, సమానత్వం కోసం పోరాడిన గొప్ప మానవతా వాది సావిత్రీబాయి ఫూలే అని చెప్పారు. అసమానతలు, అంతరాలు, వివక్ష, వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ స్థాపించి ఉద్యమించటం చిన్న విషయం కాదన్నారు. ఈ క్రమంలో ఎన్నో అవంతరాలు, అవమానాలను ఎదుర్కొన్నారని వివరించారు. విద్య నేర్చుకోవటమే నేరమన్న భావన చలామణిలో ఉన్న కాలంలో..మూఢ నమ్మకాలు, వెనుకబాటుతనాన్ని దూరం చేయాలంటే విద్యనే ఆయుధమని ఫూలే నొక్కిచెప్పారన్నారు. అందుకే సావిత్రాబాయి ఫూలేకు ముందుగా విద్యను నేర్పి..తద్వారా శూద్రులకు, అతి శూద్రులనబడే వారికి విద్యనందించాలనే లక్ష్యంతో పాఠశాలలు నెలకొల్పారని చెప్పారు. ఇందుకు మనువాదానికి, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారని వివరించారు. జోతిభాఫూలే, సావిత్రిబాయి ఫూలే బ్రాహ్మాణ భావాజాలాన్ని వ్యతిరేకించారని చెప్పారు. సమాజాన్ని వెనక్కు నడిపిస్తున్న హిందూ ధర్మాలు, ఆచారాలను వారు నిరంతరం వ్యతిరేకించేవారన్నారు. ప్రజల్లో ఉన్న వెనుకబాటును ఆసరా చేసుకుని ఆదాయ వనరులున్న దగ్గర బ్రాహ్మణులు నాడూ, నేడు తిష్ట వేశారని ఉదహరించారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయన్నారు. అక్కడ గతానికంటే ఇప్పుడు నేరాల శాతం తగ్గిందని చెప్పటం హాస్యాస్పదమన్నారు. మహిళలపై లైంగిక దాడులు పెరిగాయనీ, అందుకే అక్కడ ఎక్కువ మంది జైల్లో ఉన్నారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళాభివృద్ధి పట్ల వారి కార్యాచరణ వివక్షతతో ఉందని తెలిపారు. మహిళా బిల్లు విషయంలోనూ నాన్చుడు ధోరణి అనుసరిస్తున్నారని విమర్శించారు. టీపీఎస్కే కన్వీనర్ జి రాములు మాట్లాడుతూ సమాజంలో ఉన్న ఎక్కువ, తక్కువలు..స్త్రీని రెండో తరగతి పౌరురాలుగా చూడటం సహజ ధర్మంగా స్థిరీకరించారని తెలిపారు. మనువాద రాజ్యాంగంలో పొందుపర్చిన అంశాలనే నేటికి అమలు జరుగుతున్నాయని వివరించారు. సావిత్రీబాయి ఫూలే జయంతిని ఉపాధ్యాయినీ దినోత్సవంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ నాటి కాలంలోనే మహిళా అభ్యున్నతికి పాటు పడిన గొప్ప వ్యక్తి సావిత్రీబాయి ఫూలే అని చెప్పారు. స్త్రీకి విద్య ద్వారానే చైతన్యం వస్తుందని భావించిన ధీర వనిత ఆమె అని చెప్పారు. గొప్ప సామాజిక విప్లవకారిణిన్నారు.
సామాజిక సేవలనూ కొనసాగించారని చెప్పారు. టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ సరస్వతి మనువాదులు పేపర్‌పై గీసిన ఓ బొమ్మ మాత్రమేనని సావిత్రి బాయి ఫూలే మెజార్టీ ప్రజల విద్యకోసం, సమానత్వ సమాజం కోసం పాటుపడ్డ చదువులతల్లి టి స్కైలాబ్ బాబు కొనియాడారు. నియోకర్సర్ కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలనుంచి దృష్టి మరల్చేందుకే పెండి వయస్సు 18 ఏండ్లనుంచి 21 ఏండ్లకు పెంచారని చెప్పారు. మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సావిత్రీ బాయి ఫూలే పోరాట స్ఫూర్తితో నేడు ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.