Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒమిక్రాన్ భయం వద్దు... జాగ్రత్తగా ఉండండి
- ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచండి
- 15 రోజుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయండి
- కోటి హోం ఐసోలేషన్ కిట్స్...
- రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు... : వైద్యా రోగ్యశాఖ సమీక్షలో సీఎం కేసీఆర్
- లాక్డౌన్ అవసరం లేదు : అధికారుల నివేదిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశంలో కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్నందున రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆదేశిం చారు. ప్రజలు ఆందోళన చెందొద్దనీ, గుంపులుగా గుమికూడొద్దనీ, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. అయినా పూర్తి స్థాయి అప్రమత్తతో వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖా నాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తు తం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నగరపాలికల్లో సామాన్యుల కు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు హైదరాబాద్ తరహాలో మరిన్ని బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సోమవారం నాడాయన ప్రగతి భవన్లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి టీ.హరీశ్‌రావు, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంక ట్రాంరెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఏ జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎమ్ రిజ్వీ, ప్రజారోగ్యశాఖ సం చాలకులు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి, గంగాధర్, చంద్ర శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ఠ్రంలోని కరోనా పరిస్థితులను సీఎమ్‌కు వివరించారు. ప్రస్తుతం లాక్డౌన్ అవసరం లేదనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచొచ్చని వారు నివేదిక సమర్పించారు. దీనిపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఒమిక్రాన్ పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే అజాగ్రత్త పనికిరాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలన్నారు. పని చేసే దగ్గర మాస్క్‌లు ధరించాలనీ, ప్రభుత్వం జారీ చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా మార్చారనీ, మిగిలిన మరో శాతాన్ని కూడా తక్షణమే ఆక్సిజన్ బెడ్లుగా మార్చాలని ఆదేశించారు. గతంలో రాష్ట్రంలో కేవలం 140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్ధ్యం మాత్రమే ఉన్నదనీ, ఇప్పుడు దాన్ని 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామనీ, దీన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హౌం ఐసోలేషన్ చికిత్స కిట్లను 20 లక్షల నుంచి ఒక కోటి వరకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రస్తుతం 35 లక్షలున్న టెస్టింగ్ కిట్లను రెండు కోట్లకు పెంచాలని ఆదేశించారు. అన్ని దవాఖా నాల్లో డాక్టర్లు తక్షణం అందుబాటులో ఉండేలా చూడాలని, ఖాళీలను 15 రోజు ల్లో భర్తీ చేసుకునే విధంగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రంలో డాక్టర్లు, బెడ్లు మౌలిక వసతులను పెంచుకొని వైద్యసేవలను మెరుగుపరచాలని అన్నారు. నూతనంగా నిర్మించుకున్న సమీకత కలెక్టర్ కార్యాలయాల్లోకి పలు శాఖల కార్యాలయాలు మారుతున్నాయనీ, ఖాళీ అయిన పాత కలెక్టరేట్ కార్యాలయాలు, ఆయా శాఖల భవనాలు, స్థలాలను వైద్యారోగ్య శాఖ అవసరాల కోసం కేటాయించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలిసిస్ మిషన్లను మరిన్ని పెంచాలని చెప్పారు. నగర పాలికలు, హెచ్ఎండిఏ, కంటోన్మెంట్ జోన్ పరిధిలో ప్రజలకు సరైన వైద్య సేవలు అందేలా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటి ప్రణాళికలను పరిశీలించి, ఆదేశాలు జారీ చేశారు.