Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మతోన్మాద శక్తుల పైశాచిక చర్యే బుల్లిభారు యాప్‌ని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్డీ అబ్బాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ యాప్ లో ముస్లిం మహిళల ఫొటోలను వేలానికి పెట్టి పైశాచికానందం పొందుతున్న మతోన్మాదులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో ఇలాంటివి జరక్కుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సామాజికంగా, రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలపై ఈ మధ్యే ముస్లిం మహిళలు గొంతెత్తుతున్నారని తెలిపారు.