Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థులకు న్యాయం చేయాలి :టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లలో గందరగోళం నెలకొందని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ విమర్శించారు. జగిత్యాల, సిరిసిల్ల, మంథని, హైదరాబాద్ కాలేజీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రిజర్వేషన్ వారికి రూ.500, ఇతరులకు రూ.వెయ్యి వసూలు చేశారని వివరించారు. నోటిఫికేషన్లో ఎక్కడా కామన్ పరీక్ష ఉంటుందని ప్రకటించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఒకే పరీక్ష అంటే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జేఎన్టీయూహెచ్ అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేర్వేరుగా దరఖాస్తులు స్వీకరించినట్టే వేర్వేరుగా పరీక్షలు నిర్వహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.