Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆదిలాబాద్లో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పున:ప్రారంభించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. ఆదిలాబాద్లో సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని పున:ప్రారంభించాలంటూ కేంద్రమంత్రికి కేటీఆర్ లేఖ రాయడాన్ని ఆహ్వానించారు. ఆ ఫ్యాక్టరీని అక్కడ ప్రారంభిస్తే యువతకు ఉద్యోగాల కల్పన ఆ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ యాజమాన్యం కేవలం అనుమతి ఇస్తే ఆర్థికంగా తాము చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని వివరించారు. ఇప్పటికైనా కేంద్రం ఆదిలాబాద్ అభివృద్ధి దృష్ట్యా ఫ్యాక్టరీని ప్రారంభించాలని కోరారు.