Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ నియంత్రణ, స్పందన కోసం ప్రత్యేకంగా కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపడుతున్న చర్యల కింద తమ వాటాలో 50 శాతం విడుదల చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిధులను గతేడాది ఆగస్టు 24నే విడుదల చేయగా నవంబర్లో విడుదల చేసినట్టు తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రానికి ఇచ్చేందుకు రూ.456.08 కోట్లకు ఆమోదం లభించగా, రూ.229.34 కోట్లు విడుదలయ్యాయనీ, అందులో రూ.42.83 కోట్లు (18.68 శాతం) మాత్రమే ఖర్చు చేసినట్టు ఆ ప్రకటనలో వివరించింది