Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మెన్ తిరుమల్‌రెడ్డి
నవతెలంగాణ - చిగురుమామిడి/ తిమ్మాపూర్
ప్రతి పౌరుడు జీవించడానికి ఆహారం పొందడం హక్కు అని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మెన్ తిరుమల్‌రెడ్డి అన్నారు. మంగళ వారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు భారతితో కలిసి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాల్లో చౌకధరల దుకాణాలు, అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి పౌరుడూ జీవించడానికి ఆహారం పొందడం హక్కు అన్నారు. రేషన్ షాపు డీలర్లు ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని, లబ్దిదారుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని చెప్పారు.