Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ న్యాయం చేస్తాం : ఎస్టీయూటీఎస్ డైరీ ఆవిష్కరణలో హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్టీయూటీఎస్ నూతన సంవత్సరం డైరీని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హైదరాబాద్‌లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులెవరూ ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉపాధ్యాయుల బదలాయింపు, కేటాయింపు ప్రక్రియలో జిల్లాల్లో తప్పులు దొర్లినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. వాటి సవరణ కోసం అధికారులు నిమగమై పనిచేస్తున్నారనీ, అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చూస్తుందని స్పష్టం చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఎస్టీయూటీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను, జీవోల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల బదలాయింపు ప్రక్రియలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి చెప్పారు. వారికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఈ కార్యమ్రంలో ఎస్టీయూటీఎస్ అధ్యక్షులు జి సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి ఎం పర్వత్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు బి భుజంగరావు, డైరీ కన్వీనర్ ఏవి సుధాకర్, నాయకులు శంకర్, కరుణాకర్‌రెడ్డి, పోల్‌రెడ్డి, ఇఫ్తకారుద్దీన్, నర్సింహారెడ్డి, ప్రవీణ్‌కుమార్, బి వెంకటేశ్వర్లు పాండురంగారెడ్డి, పరమేశ్వర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.