Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎల్.రమణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేతపై జీఎస్టీని జీరో చేయాలని డిమాండ్ చేస్తూ పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో హ్యాండ్లూమ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. ఉదయం 10 గంటలకు నెక్లెస్‌రోడ్ (పీవీ మార్గ్)లో ప్రారంభమయ్యే ఈ మార్చ్‌ను జయప్రదం చేయాలని ఆయన చేనేత కార్మికులకు పిలుపునిచ్చారు.
మానేరు రివర్‌ఫ్రంట్‌పై సమీక్ష...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనుల పురోగతిపై బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్... మంగళవారం హైదరాబాద్‌లో సమీక్షించారు. రూ.410 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం గతంలోనే అనుమతినిచ్చిందని ఆయన తెలిపారు. పది కిలోమీటర్ల ప్రతిపాదిత ప్రాజెక్టులో మొదటి విడతగాల నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణాలు జరగబోతున్నాయని వివరించారు. సంబంధిత పనులను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా పాల్గొన్నారు.