Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు చేసుకోవాలి: రాష్ట్ర విపత్తుల నివారణా శాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కోవిడ్ -19 తో మరణించిన వారి అర్హులైన సమీప కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కోవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలను ఎక్స్-గ్రేషియాగా అందచేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ ఎక్స్-గ్రేషియా పొందేందుకు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను దాఖలు చేసుకోవాలని రాష్ట్ర విపత్తుల నివారణా శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్-19 తో చనిపోయినట్టు అధికారిక డాక్యుమెంట్, ఇతర డాక్యుమెంట్లతో రాష్ట్రంలోని ఏదేనీ మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ధరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర అవసరమయ్యే డాక్యుమెంట్లను జత పరచి పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 040 -48560012 అనే నెంబర్‌కు గానీ, ఎవవరవఙaరబజూజూశీత్ీఏ్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ అనే మెయిల్‌ను గానీ సంప్రదించాలని సూచించింది.