Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తల ప్రాణంతో బండి సంజరు చెలగాటం:ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని శాసనమండలి మాజీ చైర్మెన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను ఉల్లంగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు కార్యకర్తల ప్రాణంతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. బీజేపీ పోకడలను చూసి దేశ ప్రజలంతా భయపడుతున్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని ప్రభుత్వరంగ సంస్థలనూ అమ్ముకుంటూ పోతున్నారన్నారు. మతాలను, కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఐటీ దాడులు, సీబీఐ, ఈడీ దాడులు చేస్తూ నాయకులను అణచేయాలని చూస్తోందన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ కూడా కుయుక్తులు పన్నుతున్నారనారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రాల అధికారాలను లాగేసుకొని, కేంద్రం ఏకఛత్రాధిపత్యం చేయాలని కుట్ర పన్నుతున్నదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. మోడీ పాలన వల్ల దేశంలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయన్నారు.