Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
కుమురంభీం- ఆసిఫా బాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి సుశీల్‌కుమార్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్ శ్రీనాథ్ తెలిపారు. మంగళవారం విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 11న కరీంనగర్లో జరిగిన జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చారన్నారు. ఈ నెల 9 నుంచి 11 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే 39వ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థిని అభినందించిన వారిలో వైస్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రహిమన్, పీడీ సట్ల శంకర్, పీఈటీ కోట యాదగిరి, అధ్యాపకులున్నారు.