Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుదుత్పత్తిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రానికి ఫస్ట్‌ర్యాంక్ ఇచ్చింది. 2021 డిసెంబర్ 31తో ముగిసిన సంవత్సరానికి సీఈఏ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దానిలో సింగరేణి థర్మల్ విద్యుత్కేంద్రం 87.18 శాతం పీఎల్ఎఫ్ సాధించి ప్రధమస్థానంలో నిలిచింది. తెలంగాణ జెన్కో 73.98 శాతం, పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 70.29 శాతం పీఎల్‌ఎఫ్‌తో రెండు, మూడుస్థానాల్లో నిలిచాయి. 68.10 శాతం పీఎల్ఎఎఫ్.తో చత్తీస్ఘడ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ 68.10 శాతంతో నాల్గవ స్థానంలో, ఒడిస్సా పవర్ జనరేషన్ కార్పోరేషన్ 63.95 శాతంతో ఐదవ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ జెన్కో 58.83 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఆరవ స్థానంలో నిలిచాయి. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించడం పట్ల ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ హర్షం ప్రకటించారు. ఉద్యోగులను అభినందించారు. ఈ ఆర్ధిక సంవత్సరం డిసెంబర్ వరకూ 29 శాతం వద్ధితో 6,904 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి, రూ.2,879 కోట్ల అమ్మకాలు జరిపినట్టు వివరించారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు రిజర్వాయర్‌పై సింగరేణి నిర్మించతలపెట్టిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనులకు మార్చి నెలలో టెండర్లు పిలుస్తామని చెప్పారు.