Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైల్ విస్తరణకు రూ.800 కోట్లు:మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వెల్లడి
హైదరాబాద్ : ప్రముఖ అభరణాల రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భారీ పెట్టుబడులు, విస్తరణను ప్రకటించింది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులతో కొత్తగా 22 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో పలు దేశాల్లో 750 స్టోర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మలబార్ గ్రూప్ చైర్మెన్ ఎంపీ అహ్మాద్ తెలిపారు. మంగళవారం ఆయన వర్చూవల్‌గా మీడియాతో మాట్లాడుతూ దేశంలో కొత్త స్టోర్ల ఏర్పాటు, తయారీ, టెక్నికల్, నిర్వహణలో దాదాపుగా 5,000 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. తాజా విస్తరణలో భాగంగా బెంగళూరులో తొలి స్టోర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలతో పాటు ఖతార్, మలేషియా, అబూదాబి, దుబయి, ఓమన్ తదితర ప్రాంతాల్లో కొత్త షోరూంలను ఏర్పాటు చేయనున్నామన్నారు. 1993లో ఈ రంగంలో అడుగుపెట్టిన మలబార్ గ్రూపునకు ప్రస్తుతం 10 దేశాల్లో 260 అవుట్లెట్లను కలిగి ఉంది. అదనంగా భారత్, మధ్య ఈశాన్య, అమెరికా తదితర ప్రాంతాల్లో 14 హోల్‌సేల్ యూనిట్లు, కార్యాలయాలు, డిజైన్ సెంటర్లు, ఫ్యాక్టరీలతో కార్యకలాపాలు సాగిస్తోంది. నూతన విస్తరణలో భాగంగా కొత్త మార్కెట్లపై దృష్టి కేంద్రీకరిస్తున్నామని ఆ సంస్థ ఇండియా ఆపరేషన్స్ ఎండీ ఒ ఆషెర్ పేర్కొన్నారు.