Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 మందితో నూతన కమిటీ
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా రమేష్‌బాబు మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా మహాసభలో ప్రతినిధి వర్గం ఎన్నుకుంది. రమేష్‌బాబు జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం ఇది రెండోసారి. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో రెండు రోజుల పాటు జరిగిన మహాసభ మంగళవారంతో ముగిసింది. మొత్తం 18 మందితో నూతన కమిటీని ఎన్నుకోగా.. వారిలో ఆరుగురు కార్యదర్శివర్గ సభ్యులు. జిల్లా కార్యదర్శిగా రమేష్‌బాబు, కార్యదర్శి వర్గ సభ్యులుగా పెద్ది వెంకట్రాములు, నుర్జహాన్, సబ్బని లత, మల్యాల గోవర్ధన్, పల్లపు వెంకటేష్, జంబిశెట్టి శంకర్‌గౌడ్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా యేశాల గంగాధర్, రామ్మోహన్రావు, పెద్దిసూరి, బోడ అనిల్, అజరు, కొండ గంగాధర్, కవిత, సుజాత, విగేష్, జంగం గంగాధర్, నన్నేసాబ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.