Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈనెల 11 నుంచి పాఠశాలలకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో మూడురోజుల ముందే ఈనెల 8 నుంచే అన్ని విద్యాసంస్థలకూ సెలవులు ఇవ్వాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.