Authorization
Thu April 17, 2025 04:49:41 am
- ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో గ్రేడ్-2 సూపర్వైజర్ పరీక్ష ప్రశ్నలుండటం అన్యాయం
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
- అదనపు మార్కులు కలుపుతాం : ఐసీడీఎస్ కమిషనర్ దివ్యరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రేడ్-2 సూపర్వైజర్ పరీక్ష రాసిన అంగన్వాడీ ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.కవిత డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ కమిషనర్ దివ్యరాజన్ తో యూనియన్ ప్రతినిధుల ఆన్లైన్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలను కమిషనర్ దృష్టికి వారు తీసుకెళ్లారు. అంగన్వాడీ ఉద్యోగుల స్థాయిని పరిగణనలోకి తీసుకోకుండా ఐఏఎస్, ఐపీఎస్ తర హాలో ప్రశ్నలు అడగటమేంటని ప్రశ్నించారు. 40 పేజీల బుక్‌లెట్‌తో ఉన్న ప్రశ్నాపత్రాన్ని 90 నిమిషాల్లో ఎలా పూర్తిచే యగలుగుతారని ప్రశ్నించారు. డిగ్రీ, పీజీ చదివిన వారికి కూడా ఒక్కో ప్రశ్న అర్థం చేసుకోవడానికి కనీసం ఐదు సమ యం పట్టిందనే విషయాన్ని వారు కమిషనర్ దృష్టికి తీసుకె ళ్లారు. మైనస్ మార్కుల పద్ధతిని కూడా తప్పుబట్టారు. పరీక్ష రాసినవారందరికీ అదనపు మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో నిర్వహించే పరీక్షలో అంగన్వాడీల స్థాయిని బట్టే ప్రశ్నపత్రాలు రూపొందించాలనీ, పరీక్షా సమ యాన్ని మూడు గంటలకు పెంచాలని కోరారు. దీనిపై కమి షనర్ దివ్యరాజన్ స్పందిస్తూ సాధ్యమైన మేరకు అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదనపు మార్కులు కలుపుతామనీ, కాంట్రాక్ట్ సూపర్వైజర్లను మరొక కోటాలో భర్తీ చేస్తామని భరోసానిచ్చారు. 433 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులను అంగన్వాడీ టీచర్లతోనే భర్తీ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీనిచ్చారు.