Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు అధ్యాపకుల సంఘంతో మంత్రులు హరీశ్‌రావు, సబిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హైకోర్టు సానుకూలంగా ఇచ్చిన తీర్పును మంత్రులు టి హరీశ్‌రావు, పి సబితా ఇంద్రారెడ్డికి వివరించామని ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (475) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్ వివరించారు. మంగళవారం వారు మంత్రులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ మంత్రులు ఆవిష్కరించారు. దీనిపై స్పందించిన మంత్రులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెపి శోభన్‌బాబు, ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్‌రెడ్డి, పడాల జగన్నాథం, నాయకులు సంగీత, ఉదయశ్రీ, భాస్కర్, పూర్ణచందర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.