Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పేందుకే
- ఒప్పందంలో భాగంగానే బండి అరెస్టు : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పేందుకే సీఎం కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరుని అరెస్టు చేయడం, జాతీయ అధ్యక్షులు జేడీ నడ్డా హైదరాబాద్‌కు రావడం... ఇదంతా ఆ పార్టీల ఒప్పందంలో భాగమేనన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల డ్రామా ప్రారంభమైందని విమర్శించారు. మొదటి భాగంలో బండి సంజరు అరెస్టు అయ్యారనీ, రెండో భాగంలో నడ్డా వచ్చి నిరసనల్లో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించడానికే నాటకమాడుతున్నారని విమర్శించారు. టీపీసీసీ కార్వనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్లు ఆడుతున్న నాటకం రక్తి కడుతున్నదని విమర్శించారు. బీజేపీకి 14 నియోజకవర్గలకు మించి నాయకులు లేరు కానీ ప్రత్యామ్నాయమంటూ ఊదరగొట్టుకుంటున్నారని చెప్పారు.
విజయడెయిరీ కంటే అమూల్ గొప్ప కంపెనీయా? : పొన్నాల
రాష్ట్రంలోని పాల ఉత్పత్తులను అమ్ముల్ కంపెనీకి ఎందుకు అప్పగించారని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. విజయ డెయిరీ కంటే అమూల్ కంపెనీ ఎలా గొప్పదో చెప్పాలన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని ప్రొత్సహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పాడి పరిశ్రమ కుంటుపడుతుంట,ే టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు. ఒకవైపు రైతుల కష్టాలు, మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు, ఇంకోవైపు అసంబద్ధమైన ఉద్యోగ బదిలీలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంబరాలు ఎలా జరుపుకుంటారని ప్రశ్నించారు. ' రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆత్మహత్యలు పట్టవు, కౌలు రైతుల సమస్యలను పట్టించుకోదు. మద్దతుధర కల్పించడం లేదు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత లేదు' మరి సంబరాలెందుకని ఆయన నిలదీశారు.
దళిత బంధు అమలు చేయిస్తారా? రాజీనామా చేస్తారా?:ప్రీతం
గతేడాది నవంబర్ నాలుగో తేదీ నుంచి దళితు బంధు అమలు చేస్తామంటూ సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారనీ, జనవరి వచ్చినా,దాని ఊసేలేదని కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర చైర్మెన్ నాగరిగారి ప్రీతం విమర్శించారు. దళితబంధు అమలు చేయిస్తారా? ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తారా? తేల్చుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు రక్షణ లేదన్నారు. దళిత బంధు కోసం రాజీనామా చేయాలనీ, మిమ్మల్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ లేకుండా అధిష్టానాన్ని ఒప్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల కావడం లేదనీ, దానికి చైర్మెన్‌ను కూడా నియమించలేకపోవడంతో అనేక సమస్యలు పెండింగ్‌లో పడుతున్నాయని చెప్పారు. సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని హెచ్చరించారు.