Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 21 వరకు అవకాశం
- ద్వితీయ విద్యార్థులు ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ రాయొచ్చు : ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈనెల 24 వరకు ఉన్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్, ఒకేషనల్, ఫెయిలైన, ప్రయివేటు విద్యార్థులు ఫీజు చెల్లించాలని కోరారు. ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్లో జరుగుతాయని వివరించారు.
ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా బుధవారం నుంచి ఈనెల 24 వరకు చెల్లింపునకు అవకాశముందని తెలిపారు. ఆలస్య రుసుం రూ.వందతో ఈనెల 25 నుంచి 31 వరకు, రూ.500తో వచ్చేనెల ఒకటి నుంచి ఏడు వరకు, రూ.వెయ్యితో ఎనిమిది నుంచి 14 వరకు, రూ.2 వేలతో వచ్చేనెల 15 నుంచి 21 వరకు చెల్లించేందుకు గడువుందని వివరించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గతేడాది అక్టోబర్లో జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల సబ్జెక్టులను ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఫీజు వివరాల సమాచారాన్ని ఇస్తున్నామని తెలిపారు.
నేషనల్ స్కాలర్షిప్ స్కీం దరఖాస్తు గడువు 15 వరకు పొడిగింపు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించే నేషనల్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసే గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు కొత్త, రెన్యూవల్ కోసం దరఖాస్తు చేయొచ్చని సూచించారు. రాష్ట్రంలో 81,594 మంది విద్యార్థులు ఈ పథకానికి ఎంపికయ్యారని వివరించారు. ఆ వివరాలను ్రbఱవ.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. ఆ విద్యార్థుల వివరాలను విద్యాసంస్థలు పరిశీలించి పంపించేందుకు గడువును ఈనెల 31 వరకు పొడిగించామని పేర్కొన్నారు.