Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
జీవో 317తో వేరే జిల్లాల్లో తమకు పోస్టింగ్ ఇవ్వడంతో నష్టపోతున్నామని ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావును కలిసి నర్సులు వినతిపత్రాన్ని అంద జేశారు. ఆ వినతిపత్రాన్ని చూసిన మంత్రి దాన్ని అక్కడే చించేసి పడేసినట్టు నర్సులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీశ్‌రావు విచ్చేశారు. ఈసమయంలో 317జీవోతో ఆరో జోన్లో ఉన్న తమకు మూడో జోన్‌కు పోస్టింగ్ఇవ్వడంతో తమకు అనాయ్యంజరిగిందనీ, తమను ఆదుకో వాలని కోరుతూ వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సంఘం చైర్మెన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రాన్ని చూసిన హరీశ్‌రావు ఒకింత అసహనానికి గురయ్యారనీ, ఆవెంటనే చించివేసినట్టు నర్సులుతమగోడును మీడియాముందు వెల్లబోసుకున్నారు. జోన్లమార్పిడితో స్థానికజిల్లాను పూర్తిగామర్చిపోవాల్సిన పరిస్థితివచ్చిందనీ, తమకు న్యాయం చేయాలని మంత్రిని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.