Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జిల్లాలో ఘటన.. పాఠశాలకని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి
- పోలీసులకు బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
బైక్పై పాఠశాలకు తీసుకెళ్తామంటే.. గ్రామస్తులే కదా అని నమ్మి ఎక్కిన దళిత బాలికను ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టారు దుండగులు. ఈ ఘటన వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లయ్యపల్లిలో మంగళవారం జరి గింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ దళిత బాలిక సీసీ కుంటలో పాఠశాలలో హైస్కూల్ చదువు చదువుతోంది. బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతి రోజూ నడిచి వెళ్లేది. అదే గ్రామానికి చెందిన బీసీ సామాజిక తరగతికి చెందిన నాగరాజు, దాసర్ల అనిల్ బాలికను అనుసరించారు. బైక్పై పాఠశాలలో దించుతామని నమ్మబలికారు. గ్రామస్తులే కాబట్టి నమ్మి బైక్ ఎక్కిన బాలికను దారి మళ్లించి కంపచెట్ల వైపు తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించినా వినకుండా నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ లైంగిక దాడి చేశారు. ఎవరికైనా చెబితే చంపుతామని భయపెట్టి వెళ్లిపోయారు. ఎలాగోలా అక్కడి నుం చి ఇంటికి చేరిన బాధితురాలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వెంటనే వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి పంపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగన్న తెలిపారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నా
బాలికపై లైంగిక దాడి చేసిన నాగరాజు, అనిల్ కుమార్ను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు భగత్, ఎమార్మీఎస్ జిల్లా అధ్యక్షులు గంధం లక్ష్మయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.ఆది డిమాండ్ చేశారు. పాన్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్రంలో ఎక్కడో ఒక చోటా నిత్యం దళిత బాలికలు, మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు కోళ్ల శివ, మంద నరసింహా, ఉమా సన్నయ్య, చిక్కపల్లి మాజీ సర్పంచ్ నరసింహ, మల్లాయిపల్లి రామస్వామి, కమలాకర్, స్వామి, కురుమయ్య, రాజు, పెంటయ్య, గోపిచంద్, ఆది, శీను, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.