Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వనపర్తి జిల్లా పానగల్ మండలం మల్లయ్యపల్లిలో మైనర్ బాలికపై దారుణానికి పాల్పడిన నాగరాజును కఠినంగా శిక్షించాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. బాలికను పాఠశాల వద్ద డ్రాప్ చేస్తామంటూ బైక్పై ఎక్కించుకుని పొదల్లోకి తీసుకెళ్లిన అతడు... అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు.