Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపై సమావేశాన్ని నిర్వహించారు. కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వివిధ శాఖాధిపతులు పాల్గొన్నారు. ర్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో నూటికి నూరు శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్ బ్యాక్ ఈసారి అత్యంత కీలకమని చెప్పారు. ఇందుకు సంబంధించి పారిశ్రామికవర్గాల నుంచి కేంద్రం ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటుందని తెలిపారు.