Authorization
Wed April 23, 2025 01:55:48 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు(ఆర్ఎస్ఎస్) సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునిల్ అంబేకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశాల్లో సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సహ సర్ కార్యవాహ దత్తాత్రేయ హౌసబలేలతో సహా ఐదుగురు సహ కార్యవాహలు, మొత్తం 36 సంస్థలకు చెందిన 216 మంది పదాధికారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేండ్లు అవుతున్న సందర్భంగా విద్య, ఆర్ధిక రంగం, సేవ మొదలైన సామాజిక రంగాల్లో చేస్తున్న కృషిపై చర్చించనున్నామని తెలిపారు.