Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బుల్లిబాయ్ యాప్ మాటున మహిళలపై ఫాసిస్టు దాడిని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ యాప్ మాటున వందమంది ముస్లిం మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టడం సరైంది కాదని తెలిపారు. ప్రణాళిక ప్రకారం మైనార్టీ మహిళలను లక్ష్యంగా చేసుకుని కుట్రలో భాగంగానే వచ్చాయని విమర్శించారు. వాటి వెనుక ఆకతాయిలు లేరనీ, అహంకార భావజాల, ఆధిపత్య జాత్యాంహకార అధినేతలేనని పేర్కొన్నారు. ఇది ముస్లిం మహిళల పట్ల సామాజిక కార్యకర్తల పట్ల ఉన్న విద్వేష భావానికి నిదర్శనమని తెలిపారు. స్త్రీలను గౌరవించడం, సంస్కృతి, శాంతి, సహనం, ప్రేమ, గుణం అని చెప్పే పెద్దమనుషుల నిజస్వరూపం ఇదీ అని విమర్శించారు. అన్ని మతాలనూ గౌరవించే స్నేహ, సౌభ్రాతృత్వాన్ని పౌరులుగా ఉన్నవారు నీచమైన పోస్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసు, ఐటీ యంత్రాంగం ఈ యాప్ రూపొందించిన వారిని, వారి వెనకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.