Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రోజుల్లో ఆ పాఠశాలల్లో చేరాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు పోస్టింగ్లు ఇచ్చే ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలుత ఎలాంటి ఇబ్బందుల్లేని ఉపాధ్యాయులకు సంబంధించి పోస్టింగ్లు ఇస్తున్నారు. వారు మూడు రోజుల్లో అంటే శనివారం నాటికి పోస్టింగ్లు ఇచ్చిన కొత్త పాఠశాలల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల సర్కారు బడుల్లో 1.09 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారిలో 22,500 మంది ఉపాధ్యాయుల వరకు స్థాన చలనం కలిగింది. మిగతా 86.500 మంది టీచర్లు వారు ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలకే కేటాయించబడిన విషయం తెలిసిందే. దీంతో వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లోనే విధులు నిర్వహిస్తారు. 22,500 మంది ఉపాధ్యాయులు మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా నుంచి వేరే జిల్లాకు కేటాయించబడ్డారు. వారికి పాఠశాలను కేటాయిస్తూ పోస్టింగ్లు ఆయా జిల్లాల డీఈవోలు ఇస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో సుమారు 4,200 మంది ఉపాధ్యాయులు వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.