Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ పాల్వంచ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం సజీవ దహనం ఘటనలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నారి కూడా బుధవారం చనిపోయింది. ఈనెల 3వ తేదీన పాల్వంచ మున్సిపల్ పరిధిలోని పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ ప్రమాదంలో రామకృష్ణ, అతని భార్య, పెద్ద కుమార్తె సాహిత్య సజీవ దహనమయ్యారు. రెండో కుమార్తె సాహితి 80 శాతం కాలిన గాయాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందింది. సాహితిని బతికించడానికి డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోస్టుమార్టం అనంతరం ఏఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో సాహితి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మూడ్రోజులపాటు ప్రాణంతో పోరాడిన చిన్నారి శ్వాస విడువడంతో స్థానికులను కన్నీళ్లు పెట్టించింది.