Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్ టౌన్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు రాష్ట్ర హైకోర్టులో భారీ ఉరట లభించింది. బండి సంజయ్ జ్యుడీషియల్ రిమాండ్‌పై బుధవారం స్టే విధించిన హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి కేంద్ర మంత్రి భగవత్ కుబాతో కలిసి బయటకు వచ్చిన సంజయ్‌కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంజరు మాట్లాడుతూ.. జీవో 317 సవరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకు వెళ్లానని, జీవో సవరించకపోతే మరోసారి జైలుకు పోవడానికి సిద్దమేనని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.