Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ ఎ.జీవన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోఒక లోక్ సభ సీటుతో పాటు మూడు అసెంబ్లీసీట్లను కోల్పోవటంతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పీ.నడ్డా మతిస్థిమితం కోల్పోయారని పీయూసీ చైర్మెన్, ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నడ్డాను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ గా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబమంతా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎవరైనా ఇంత మంది కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొంటున్నారని అడిగారా? అని ప్రశ్నించారు.