Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాస్పిటల్ వర్కర్లకు అభినందనలు: టియుఎంహెచ్ఇయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం ఎన్నిరకాలుగా బెదిరించినా లెక్కచేయక ఒక రోజు సమ్మెను జయప్రదం చేసిన హాస్పిటల్ వర్కర్లను తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టియుఎంహెచ్ఇయూ) అభినందించింది. సమ్మె సందర్భంగా పోలీసులు చేసిన అరెస్టులను ఖండించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, కె.యాదానాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలు పెంచాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని 14 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినా సర్కారు స్పందించకపోవడంతో పేషెంట్ కేర్, శానిటేషన్, స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, ఇతర టెక్నీషియన్లు పెద్ద ఎత్తున సమ్మె చేశారని తెలిపారు. సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా అరెస్టులు చేయించిందని తెలిపారు. సంగారెడ్డి, జగిత్యాలలో అరెస్టులు చేశారనీ, గాంధీ హాస్పిటల్, మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పోలీసులను మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారని వెల్లడించారు. మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్ చెరు, కరీంనగర్, జగి త్యాల, సిరిసిల్ల, హుజూరాబాద్, జమ్మికుంట, ఆదిలాబాద్, ఎంజీఎం, జనగాం, మంచిర్యాల, ఖమ్మం, గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, నల్లగొండ, హైదరాబాద్ చెస్ట్ ఆస్పత్రి, వనపర్తి కేంద్రాల్లో సమ్మె సంపూర్ణంగా జరిగిందని తెలిపారు. సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో పోటీ కార్మికులను పెట్టి సమ్మె విచ్ఛి న్నానికి ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ కనీస వేతనాల జీవో 60 లేదా కార్మికశాఖ జీవో 68 ప్రకారం వేతనాలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు.