Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రముఖ బౌద్ధక్షేత్రం బుద్ధవనం ప్రాజెక్టుపై రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ను హైదరాబాద్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో మంత్రులు కె తారకరామారావు, వి శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్ విడుదల కార్యమ్రంలో డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ పాల్గొన్నారు.