Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మదర్‌డెయిరీ-2022 డైరీ, క్యాలెండర్‌ని ఆవిష్కరించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వం పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని విద్యుత్ శాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక యూనియన్ లిమిటెడ్, నార్మూల్ మదర్ డెయిరీ, హయత్‌నగర్- 2022కు చెందిన డైరీ, క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాడి పరిశ్రమ అభివృద్ధితోపాటు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూతను అందిస్తుందని చెప్పారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించేలా పాలకవర్గం, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మదర్‌డెయిరీ చైర్మెన్ గంగుల కృష్ణారెడ్డి, పాలకవర్గ సభ్యులు చల్లా సురేందర్‌రెడ్డి, జి.శ్రీధర్‌రెడ్డి, కె.జయశ్రీ, ఉప్పల్ వెంకట్‌రెడ్డి, పి.వెంకట్రామ్రెడ్డి, అధికారులు అశోక్‌కుమార్, సంస్థ ఎండి అజరుకుమార్, జనరల్ మేనేజర్ లింగారెడ్డి, జీవీఎన్.రెడ్డి పాల్గొన్నారు.