Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో 40 శాతం మందులకు ఉండాల్సిన ప్రమాణాలు లేవని కన్జూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తెలిపింది. అసలైన మందుల కోసం డిమాండ్ చేసే హక్కు ప్రజలకుందని పేర్కొంది. కల్తీ జరిగితే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఈ మేరకు ఫోరం అధ్యక్షులు యం.రవికుమార్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వస్తు సేవల ప్యాకేజీపై ముద్రించిన రేటు కన్నా ఎక్కువకు అమ్మితే కొలతల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-4202కు ఫిర్యాదు చేయొచ్చని ఆయన వెల్లడించారు. అదే విధంగా హెయిర్ ఆయిల్ వాడితే బట్టతలపై జుట్టు వస్తుందనీ, చర్మ సౌందర్య క్రీములు, పౌడర్లతో నల్ల చర్మం తెల్లగా మారుతుందని మోసం చేసినా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. మరిన్ని వివరాల కోసం 78932 23989, 90633 34049లో సంప్రదించాలని కోరారు.